మిరుదొడ్డి, జూన్ 13 : రాష్ట్రంలోని అన్ని కులాలను సీఎం కేసీఆర్ ఆదరిస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని భూంపల్లిలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, బండా ప్రకాశ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్పీ పాఠశాలను సందర్శించి సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోని పాలకులు తెలంగాణ ప్రాంతంలోని ఏ ఒక్క కులాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని కులవృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారన్నారు.
గతంలో చేపలు తినాలంటే ప్రజలు రూ.5 వందలు చెల్లిస్తేగాని దొరికేవికావు నేడు ప్రతి గ్రామంలో చేపలు తక్కువ ధరకే లభిస్తున్నాయన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని పెద్ద బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు కృషి చేస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ ‘ మన ఊరు- మన బడి’ పథకంలో భాగంగా పాఠశాలల్లో సకల వసతులు కల్పిస్తున్నారన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, వైస్ ఎంపీపీ పోలీసు రాజులు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తుమ్మల బాల్‌రాజు, టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు సూకురి లింగం, ఉప సర్పంచ్ వడ్ల ప్రభాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, నాయకులు బోయ శ్రీనివాస్, దుబ్బరాజం, శ్రీనివాస్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
దౌల్తాబాద్, జూన్13: మండలంలోని ఇందుప్రియాల్‌లో ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతంతో చాకలి ప్రవీణ్ మృతి చెందాడు. సోమవారం ఈ విషయం తెలుసుకున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లిన ప్రవీణ్ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి యాదయ్యను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా కల్పించారు. అనంతరం ఆర్థిక సాయం అందజేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ శ్యామలాకుమార్,జిల్లా కోఆప్షన్ సభ్యుడు రహీమొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి,ఎంపీటీసీ వీరమ్మామల్లేశం,మండల యువత అధ్యక్షుడు నర్రరాజేందర్,ఏఎంసీ డైరెక్టర్ ఆంజనేయులు,టీఆర్ఎస్ నాయకుడు నాగరాజు పాల్గొన్నారు.