చిన్నకోడూరు, జూన్ 13 : అతిసార వ్యాధి నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. సోమవారం చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో అతిసార, డయేరియా రాకుండా ఐదేండ్లలోపు పిల్లలకు ఓఆర్ఎస్, జింకు కార్నర్ మందులను ఎంపీపీ మాణిక్యరెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ అతిసార మరణాలు లేకుండా ప్రభు త్వం కృషి చేస్తున్నదన్నారు.
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో ఓఆర్ఎస్, జింకు కార్నర్ మందులు అందుబాటులో ఉన్నాయని, అవసరం మేరకు ఆశ కార్యకర్తలు నేరుగా చిన్నారుల ఇంటికి వెళ్లి మందులు అందజేయాలన్నారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పం చ్ సుభాశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 13 : వర్షాకాలంలో అతిసార వ్యాధి సోకకుండా ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మద్దూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రాజు సూచించారు. సోమవారం మద్దూరు మండల కేంద్రంతోపాటు గాగిళ్లాపూర్, కమలాయపల్లి తదితర గ్రామాల్లో ఉపాధి కూలీలతోపాటు ఐదేండ్లలోపు పిల్లలకు వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. డయేరియా వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ ఈనెల 28 వరకు అతిసార నిర్మూలన పక్షోత్సవాలను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రధానంగా ఐదేండ్లలోపు పిల్లల్లో డయేరియా నివారించడం కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ ఆరిఫ్, పీఏసీఎస్ డైరెక్టర్ మల్లేశం, టీఆర్ఎస్ నాయకుడు చంద్రమౌళి, ఏఎన్ఎం నిర్మల పాల్లొన్నారు.
హుస్నాబాద్ టౌన్, జూన్ 13 : అతిసార నివారణ పక్షోత్సవాలను సోమవారం స్థానిక సర్కారు దవాఖానలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సౌమ్య, వార్డు కౌన్సిలర్ నళినితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేండ్లలోపు పిల్లలకు అతిసార సోకినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి అతిసారంపై అవగాహన కల్పించి ఐదేండ్లలోపు పిల్లల కుటుంబాలకు ఒకటిచొప్పున ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబెట్లు అందజేయాలని సూచించారు. 20వ వార్డులో కౌన్సిలర్ సుప్రజ చిన్నారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో దవాఖాన సూపరింటెండెంట్ రమేశ్‌రెడ్డి, డీపీఎంవో హన్మిరెడ్డి, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు శంకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
చేర్యాల, జూన్ 13 : డయేరియా నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పీహెచ్సీ వైద్యాధికారి అబ్దుల్ సలీం అన్నారు. సోమవారం మండలంలోని ముస్త్యాల గ్రామం లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ సలీం మాట్లాడుతూ ప్రభుత్వం డయేరియా నిర్మూలన కోసం పక్షోత్సవాలు నిర్వహిస్తున్నదని, డయేరియా నివారణ కోసం ఐదేండ్లలోపు చిన్నారులకు ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్ల అందజేస్తున్నామని చెప్పారు. ఓఆర్ఎస్ ప్యాకెట్‌ను లీటర్ తాగునీటిలో కలిపి 50-100 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని ఒక టేబుల్ స్పూన్‌తో తరచుగా పిల్లలకు తాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుల్తానా, ఉపసర్పంచ్ రవితేజ, హెచ్వీ సులోచన, ఏఎన్ఎం కరుణ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.