పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. శుక్రవారం పలు చోట్ల కార్యక్రమాలు జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వీధులను శుభ్రం చేసి, పిచ్చిమొక్కలను తొలిగించారు. మొక్కలు పెట్టేందుకు స్థలాలను చదును చేయించారు. మంచినీటి బావికి మరమ్మతులు చేపట్టారు. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 10