చేర్యాల, జూన్ 10 : చేర్యాల పట్టణంలో సర్కారు దవాఖాన నూతన భవన నిర్మాణానికి రూ.8.70కోట్ల నిధులను ప్రభుత్వం శుక్రవారం మంజూరు చేసింది. ఈ నెల 8న చేర్యాల పట్టణానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు, దవాఖాన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కేవలం రెండు రోజుల్లోనే నిధులు మంజూరు చేసి మంత్రి హరీశ్‌రావు మరోసారి మాట నిలబెట్టుకున్నారు. చేర్యాల సర్కారు దవాఖానకు నిధుల మంజూరుపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాలనర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.