సిద్దిపేట అర్బన్, జూన్ 10 : ఉపాధ్యాయ కొ లువుకు తొలి మెట్టు అయిన టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)కు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాలంటే ప్రతి ఒక్క రూ టెట్‌లో ఉత్తీర్ణులు కావాల్సిందే. రేపు అనగా ఆదివారం జరగనున్న టెట్ పరీక్షకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేశామనిన్నారు. అభ్యర్థులకు సమాచారం, సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో హెల్ప్‌లైన్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
టెట్ నిర్వహణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు గానూ జిల్లాలోని సిద్దిపేట, చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక పట్టణాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 9.30గంటల నుంచి మధ్యా హ్నం 12గంటల వరకు జరిగే టెట్ పేపర్-1 పరీక్షకు గానూ 42 కేంద్రాల్లో 10,019 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరి గే పేపర్-2 పరీక్షకు గానూ జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాల్లో 7,816 మంది అభ్యర్థులు టెట్ పరీక్ష రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరిండెంట్లు, రూట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు మొత్తం 700మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
రెండు సెషన్లలో జరిగే టెట్ పరీక్షకు ఒక్క నిమి షం ఆలస్యమైనా అనుమతి లేదని, అభ్యర్థులు సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులకు ఏదైనా సమాచారం గానీ, సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఏర్పా టు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్ 9951953322ను సంప్రదించాలని తెలిపారు. పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ పత్రంలో గడులను నల్ల బాల్ పెన్‌తో మాత్రమే నింపాలని, ఇతర రంగు గడులను పరిగణలోకి తీసుకోరన్నారు. అదే విధంగా పరీక్షా కేంద్రానికి సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని అధికారులు వెల్లడించారు.
పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 7 నుంచి సా యంత్రం 7 గంటల వరకు 144 సెక్షన్ అమలు లో ఉంటుంది. కేంద్రాల సమీపంలోని అన్ని జి రాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించాం. 500 మీటర్ల వరకు ప్రజలెవరూ గుమిగూడ వద్దు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సమయం కంటే గంట ముందే చేరుకొని, మానసికంగా ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా టెట్ పరీక్ష రాయాలి.
– శ్వేత, పోలీస్ కమిషనర్, సిద్దిపేట
ఆదివారం జరిగే టెట్ పరీక్షకు విద్యాశాఖ, కలెక్టర్ ఆదేశానుసారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం. నిమిషం నిబంధన అమలులో ఉన్నందున అభ్యర్థులు పరీక్షా సమయం కంటే ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలి..
– కె.రవికాంతారావు, జిల్లా విద్యాధికారి