వెల్దుర్తి/ రామాయంపేట/ శివ్వంపేట/ చేగుంట, జూన్ 10 : విద్యాభివృద్ధ్దిలో భాగంగా సీఎం కేసీఆర్ ‘మనఊరు-మన బడి’ ప్రవేశపెట్టారు. ‘మనఊరు-మనబడి’తో ప్రభుత్వ బడులకు అన్ని వసతులు కల్పిస్తుండడంతో కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. టీచర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామం లో బడిబాట నిర్వహిస్తున్నారు.
బడీడు పిల్లలను ప్రభుత్వ పా ఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. సర్కారు బడుల్లో లభిస్తున్న వసతులు, సదుపాయాలు, నాణ్య మైన విద్యాబోధనపై కరపత్రాలను పంపిణీ చేస్తూ వివరిస్తు న్నారు. వెలుర్తి మండలంలోని రామాయిపల్లి, శెట్పల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో శుక్రవారం తాగునీటి సంపులతో పాటు ఇతర నిర్మాణాలకు ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నారాయణ, లత, ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఏపీవో రాజు, నాయకులు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, అంజాగౌడ్, మల్ల య్య, బాలేశ్, నవీన్, యాదగిరి, టీచర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని హెచ్ఎం శ్రీనివాస్, ఆర్పీ రాజు అన్నారు. రామాయంపేట పట్టణంలోని బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచర్లు బడి బాట నిర్వహించారు. బీసీ కాలనీలో విద్యార్థుల వివరాలను సేకరించి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలన్నారు.
శివ్వంపేట మండలం నవాబ్‌పేటలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటి సర్వే నిర్వహించారు. విద్యార్థులను ప్రభుత్వ బడి చేర్పించాలని అడ్మిషన్లు అందజేశారు. ప్రభుత్వ బడుల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత దుస్తులు, నాణ్యమైన విద్య లభిస్తుందని వివరించారు.
చేగుంట మండలం కరీంనగర్లో జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు సర్పంచ్ మహిపాల్‌తో కలిసి బడిబాట ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో చదువుతు చెబుతున్నట్లు ప్రజలకు వివరించారు. ర్యాలీలో ఇబ్రహీంపూర్ సొసైటీ వైస్ చైర్మన్ తానీషా, టీచర్లు శ్రీనివాస్, నర్సింహులు, ఎస్ ఎంసీ చైర్మన్ మోహన్, వార్డు సభ్యులు రాజగౌడ్, యాదగిరి, శ్రీనివాస్, శంకరయ్య ఉన్నారు.