ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లెప్రగతి, నాలుగో విడుత పట్టణప్రగతి కార్యక్రమాలు గ్రామాలు, పట్టణాల్లో పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఎనిమిదో రోజూ శుక్రవారం పారిశుధ్య పనులు చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ప్రజలతో కలిసి రోడ్లు, మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు ఓవర్హెడ్ ట్యాంకులను క్లీన్ చేశారు. మనోహరాబాద్ మండలం రామాయిపల్లిలో నిర్వహించిన పల్లె ప్రగతిలో మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ పాల్గొన్నారు. ఆయా వార్డులో తిరిగి స్వచ్ఛతపై మహిళలకు అవగాహన కల్పించారు.
– మెదక్/సంగారెడ్డి, నెట్వర్క్, జూన్ 10