సిద్దిపేట అర్బన్, జూన్ 10 : అత్యవసరమైతేనే ప్రైవేట్ దవాఖానకు పోవాలని, సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 87 మం దికి రూ.30లక్షల 11వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 124 మంది లబ్ధిదారులకు రూ. కోటి 30లక్షల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల సౌకర్యాలు, యంత్రాలు, పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. పైసా ఖర్చు లేకుం డా ఉచితంగా ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో క్యాటరాక్ట్ ఆపరేషన్ల నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే క్యాత్ ల్యాబ్ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. నిరుపేదలు ఆర్థిక సాయం పొందేందుకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్దిపేట నియోజవకవర్గమే నిదర్శనమని చెప్పారు.
రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ. 21కోట్లు అందించినట్లు తెలిపారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని సూచించారు. వరి, పత్తి కంటే తక్కువ పెట్టబడితో అధిక ఆదాయం పొందే ఆయిల్‌పామ్ తోటలను సాగు చేసుకోవాలని సూచించారు. భూమి సహజ ఎరువు అందించేందుకు పచ్చిరొట్ట విత్తనాలను సాగు చేయాలని సూచించారు. మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు రైతులను చైతన్యపరచాలన్నారు. అనంతరం సిద్దిపేటలో 1000 మంది ఆటో డ్రైవర్లకు ఉచితంగా మంత్రి హరీశ్‌రావు బీమా చేయించారు. ఇటీవల ఆటో డ్రైవర్ చనిపోగా అతడి భార్య దాసరి అరుణకు రూ.2 లక్షల బీమా చెక్కును మంత్రి అందజేశారు.