సిద్దిపేట అర్బన్, జూన్ 10 : తక్కువ సమయంలో అధిక లాభాలు ఆర్జించే ఆయిల్ పామ్ సాగును రైతులు చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. శుక్రవారం మండలంలోని మిట్టపల్లి రైతువేదికలో ఏర్పాటు చేసిన దక్కని జాతి గొర్రెల అభివృద్ధి పథక లబ్ధిదారుల, క్షేత్ర సహాయకుల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య రాష్ట్ర చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మిట్టపల్లి రైతువేదిక వద్ద మొక్కలు నాటి, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉండే దక్కన్ జాతి గొర్రెల మాం రుచికరమైన, అత్యధిక న్యూట్రీషన్ కలిగి ఉం దక్కని గొర్రెలు ఎక్కువగా పెంచాలని గొల్ల కురుమలకు సూచించారు. సిద్దిపేట పట్టణంలోని నాన్‌వెజ్ మార్కెట్లో దక్కన్ జాతి గొర్రె మాంసం విక్రయానికి మిట్టపల్లి పెంపకందారులకు రెండు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. జిల్లాలో ఉన్న 8 లక్షల 94 వేల గొర్రెలకు 51 బృం పర్యటించి ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆయిల్‌పామ్ తోటలను అధికంగా సాగు చేయడం ద్వారా ఎకరానికి రూ. నుంచి రూ.2 లక్షల వరకు ఆర్జించవచ్చన్నారు.
ప్రభుత్వమే 90 శాతం సబ్సిడీతో డ్రిప్, మొ ఉపాధిహామీ పనిదినాలు కల్పిస్తున్నదన్నారు. పచ్చిరొట్టె విత్తనాలు సాగు చేసి రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. ఈ సందర్భంగా గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య రాష్ట్ర చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు గొల్ల, కురుమలకు సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగ నాగిరెడ్డి, డీపీవో దేవకీదేవి, ఎంపీపీ వంగ సవితాప్రవీణ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చింతల శ్రీనివాస్ యాద సర్పంచ్ వంగ లక్ష్మీ నరసింహారెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ కనకమల్లయ్య, పశు సంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.