తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి తొలి ప్రాధాన్యమిస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని కేసీఆర్‌నగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలో బస్తీ దవాఖానను ఆయన ప్రారంభించారు. 16వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతిలో పాల్గొ ని, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సిద్దిపేట పట్టణానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 50మంది నాయకులు క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొట్టి, కేంద్ర పథకాలుగా ఫేక్ ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలు ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. లాభదాయక పంట ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు.
సిద్దిపేట అర్బన్, జూన్ 10 : ప్రజారోగ్యానికే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందనడానికి బస్తీ దవాఖానలే నిదర్శనమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణ పరిధిలోని కేసీఆర్‌నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పట్టణాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఇం దులో భాగంగా సిద్దిపేట డబుల్ బెడ్రూం కాలనీ కేసీఆర్‌నగర్‌లో గతంలో తాత్కాలిక భవనంలో బస్తీ దవాఖాన సేవలు అందించేవారని, రూ.18 లక్షలతో నూతనంగా పక్కా భవనం నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. బస్తీ దవాఖానల్లో అవుట్ పేషంట్ సేవలు, బీపీ, షుగర్ 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారన్నారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తామన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో బస్తీ దవాఖానలు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, నార్మల్ డెలివరీలు జరిగేలా చూడాలని ఆశవర్కర్లు, ఏఎన్ఎంలకు మంత్రి సూచించారు. బస్తీ దవాఖానను ప్రారంభించిన అనంతరం ఆశవర్కర్లు, ఏఎన్ఎంలతో మంత్రి ముచ్చటించారు. ప్రజలు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.
నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచాలని సూచించారు. పీహెచ్‌సీల వారీగా నెల లో జరిగిన డెలివరీలపై మంత్రి ఆరా తీశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్ నాయిని చంద్రం, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.