కొమురవెల్లి, జూన్ 8 : జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలని గొర్లు, మేకల పెంపకందారులకు ఎంపీపీ తలారి కీర్తన సూచించారు. బుధవారం మండలంలోని మర్రిముచ్చాలలో జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందజేసిన నట్టల నివారణ మందును గొర్లు, మేకల పెంపకదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, మండల పశువైద్యాధికారి విజయసారథి, సిబ్బంది పాల్గొన్నారు.
నంగునూరు, జూన్ 8 : మండల పరిధిలోని నర్మెట, కొండంరాజుపల్లి గ్రామాల్లో మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి గొర్లు, మేకలకు నట్ట నివారణ మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండంలోని అన్ని గ్రామా ల్లో నట్టల నివారణ మందు పంపిణీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని గొర్లు, మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి చతుర్వేది పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 8 : జీవాల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని మద్దూరు సర్పంచ్ కంఠారెడ్డి జనార్దన్‌రెడ్డి అన్నారు. మద్దూరు మండల కేంద్రంలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్లు, మేకలు వ్యా ధుల బారిన పడకుండా ప్రభుత్వం ఉచితంగా మందు పం పిణీ చేస్తున్నదన్నారు. గొర్లు, మేకల పెంపకందారులు తమ జీవాలకు నట్టల నివారణ మందులు వేయించాలన్నారు.
బెజ్జంకి, జూన్ 8 : మండలంలోని గాగిల్లాపూర్‌లో గొర్లు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ సత్యనారాయణరెడ్డి ప్రారంభించారు. గొర్లు, మేకలు వ్యాధుల బారినపడకుండా తప్పకుండా నట్టల నివారణ మందు వేయించాలని సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లేశం, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కొండపాక, జూన్ 8 : మండల పరిధిలోని దుద్దెడ, కొండపాక గ్రామాల్లో జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. బుధవారం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువైద్యాధికారులు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మం దులు వేశారు. కార్యక్రమంలో కొండపాక సర్పంచ్ చిట్టి మాధురి దేవేందర్‌రెడ్డి, సర్పంచ్ మహదేవ్గౌడ్, ఉపసర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ బాలాజీ పాల్గొన్నారు.
తొగుట, జూన్ 8 : మండలంలోని తొగుట, ఘనపూర్ గ్రామాల్లో పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారులు రాజేందర్‌రెడ్డి, నిహారిక మాట్లాడుతూ రెండు గ్రామాల్లో 3104 గొర్రెలు, 106 మేకలకు నట్టల నివారణ మందు వేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండల్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.