కోట్లాది రూపాయల అభివృద్ధి పనులతో నర్సాపూర్ నియోజకవర్గం కొత్తరూపును సంతరించుకుం టున్నదని, మూడు దశాబ్దాల ఈ ప్రాంత ప్రజల కల అయిన బస్సుడిపోను ప్రారంభించుకున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ. 4.65 కోట్లతో నిర్మించిన బస్సుడిపోను, రూ. 50లక్షలతో పీఏసీఎస్ నూతన భవనాన్ని, మున్సిపల్లో రూ. 10.75కోట్లతో సీసీరోడ్ల నిర్మాణానికి శిలాఫలకాలను బుధవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. డిపో కలను నిజం చేసి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. ఈ ప్రాంతానికి త్వరలోనే గోదావరి జలాలు తెస్తామన్నారు. నర్సాపూర్ చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, పీజీ కళాశాలకు భవనాన్ని కట్టిస్తామన్నారు. సీఎం కేసీఆర్ సహకారం, మదన్‌రెడ్డి కృషితో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని పేర్కొన్నారు.
నర్సాపూర్, జూన్ 8: బస్సుడిపో నిర్మాణంతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమైందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో రూ.4.65 కోట్లతో నిర్మించిన బస్సుడిపోను, రూ.50 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ నూతన భవనాన్ని, మున్సిపల్లో రూ.10.75 కోట్లతో సీసీరోడ్ల నిర్మాణానికి శిలాఫలకాలను బుధవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మూడు దశాబ్దాల కల నిజం చేసి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. నర్సాపూర్‌లో ఆర్టీసీ డిపో ప్రారంభంతో ప్రజల ముఖంలో చిరునవ్వు కనబడుతున్నదన్నారు. కరోనా కారణంగా బస్సుడిపో నిర్మాణం ఆలస్యమైనప్పటికీ, అన్ని హంగులతో నిర్మాణం పూర్తిచేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లోనే అందరూ ప్రయాణించాలని, ఆర్టీసీని ఆదరించి లాభాల బాటపట్టించాలని కోరారు. ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశారన్నారు.
హల్దీవాగుపై రూ.150 కోట్లతో 15 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 2.75 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, తద్వారా రూ.300 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసిందన్నారు. నర్సాపూర్ చెరువును రూ.3.50 కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. పీజీ కళాశాల భవనానికి స్థలం కేటాయించి పక్కా భవనాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని పలు మండలాల రోడ్ల పునరుద్ధ్దరణకు ఈ మధ్యకాలంలోనే సీఎం కేసీఆర్ రూ. 35కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలోనే గోదావరి నీళ్లను నర్సాపూర్ నియోజకవర్గానికి తెప్పించి ప్రజల కాళ్లు కడుగుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్‌బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, జాయింట్ కలెక్టర్ రమేశ్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, జడ్పీటీసీ బాబ్యనాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్ద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్‌గుప్తా, కౌన్సిలర్ లతారమేశ్యాదవ్, ఆర్టీసీ ఆర్ఎం సుదర్శన్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్‌ఖాన్, జడ్పీకోఆప్షన్ సభ్యుడు మన్సూర్, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతోనే నర్సాపూర్‌లో బస్సుడిపో ఏర్పాటు చేసుకున్నామని, సీఎం కేసీఆర్ కృషితోనే ఇది సాధ్యమైందని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. డిపో నిర్మాణంతో మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కలుగుతుందని, ప్రయాణం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. డిపో నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
– ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి
ఎన్ని ప్రభుత్వాలు మారినా నర్సాపూర్ పట్టణంలో డిపో నిర్మాణం సాధ్యం కాలేదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో డిపోల నిర్మాణం జరుతోందన్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తుందో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నదని వెల్లడించారు.
– మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కోరిక మేరకు నర్సాపూర్ ఆర్టీసీ బస్సుడిపోకు తగినన్ని బస్సులు అందజేస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. నర్సాపూర్‌లో బస్సుడిపో ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ఎన్ని బస్సులు అవసరం ఉన్నా అందించడానికి సిద్ధ్దంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేశారు. సమైక్య రాష్ట్రంలో నర్సాపూర్ బస్‌డిపో హామీగానే మిగిలిపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, కేసీఆర్ సీఎం కావడంతోనే డిపో ఏర్పాటు చేసుకుని ప్రారంభించుకున్నట్లు తెలిపారు.
– రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

నర్సాపూర్‌లో నూతనంగా నిర్మించిన బస్సుడిపో ప్రారంభోత్సవంతో పండుగ వాతావరణం నెలకొన్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. మృగశిర కార్తె రోజు బస్సుడిపో ప్రారంభించుకోవడం శుభ సూచకమన్నారు. డిపోకు ఇంకో 30 బస్సులు ఇవ్వాలని రవాణాశాఖ మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ చొరవతో నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. మంజీరా నదిపై 15 చెక్‌డ్యామ్‌లను నిర్మించుకుంటున్నామని, అందులో 8చెక్‌డ్యామ్‌లు పూర్తికాగా, మిగతావి త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి చొరవతో ఫోర్‌లైన్ రహదారిని నిర్మించుకున్నట్లు తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గానికి అతి త్వరలోనే గోదావరి నీళ్లు తీసుకువస్తామన్నారు.
– నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నివర్గాలకు లబ్ధి చేకూరుతున్నదని, మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్ పట్టణంలో డిపో నిర్మాణం పూర్తి కావడానికి కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ ఉండడంతో నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో అధికారులను పరుగులు పెట్టించి బస్‌డిపో నిర్మాణం పూర్తి చేయించారన్నారు. ఇతర పార్టీలు కులాలు, మతాల గురించి మాట్లాడుతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారన్నారు.
– మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
నర్సాపూర్‌లో బస్సుడిపో ప్రారంభోత్సవం చేసుకోవడం చరిత్రలో నిలిచిపోయేరోజని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బస్సుడిపో నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల కల సాకారమైందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. డిపోలో బస్సుల సంఖ్యను ఇంకా పెంచాలని మంత్రులను కోరారు.
– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి
