సంగారెడ్డి అర్బన్/ జిన్నారం/ ఝరాసంగం/ నారాయణఖేడ్/ మెదక్ మున్సిపాలిటీ/ నర్సాపూర్, జూన్ 3: జన హృదయ నేత, అభివృద్ధి శ్రామికుడు, ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు జన్మదిన వేడుకలు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఘనంగా జరిగాయి. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పలు చోట్ల బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్‌కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబురాలు జరుపుకొన్నా రు.
సంగారెడ్డి పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయం ఆవరణ లో జరిగిన వేడుకల్లో టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి కేక్‌కట్ చేసి మంత్రి హరీశ్‌రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేయగా, మాతా శిశు కేంద్రంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీరవి పండ్లను పంపిణీ చేశారు.
సంగారెడ్డి జడ్పీటీసీ సునీతా మనోహర్‌గౌడ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, కంది జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పెరమాళ్ల నర్సింలు, సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరి, చిల్వెరి ప్రభాకర్, ప్రభుగౌడ్, టీఆర్ఎస్ సంగారెడ్డి మండలాధ్యక్షుడు చక్రపాణి, నాయకులు జలేందర్‌రావు, శ్రావణ్‌రెడ్డి, వాజీద్, నక్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రమైన జిన్నారంలోని రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి భారీకేక్‌ను కట్‌చేసి నాయకులు, కార్యకర్తలకు పంచి పెట్టారు. అనంతరం జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఐదుగురు దివ్యాంగులకు రూ.6 లక్షల విలువైన ఐదు స్కూటీలను పంపిణీ చేసి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, డీఎల్పీవో సతీశ్‌రెడ్డి, ఎంపీడీవో రాములు, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, సర్పంచ్‌లు లావణ్యాశ్రీనివాస్రెడ్డి, ఆంజనేయులు, శెట్టి శివరాజ్, ఎంపీటీసీ సంతోషమహేశ్, నాయకులు ఆకుల నవీన్‌కుమార్, శివరాజ్, బేల కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, సార నరేందర్, బషెట్టిరాజు, ఉపసర్పంచ్ సంజీవ, ఎంపీవో రాజ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులున్నారు.
మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకుని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్‌పాటిల్ కలిసి కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయంలో పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జగదీశ్వర్, ఎంపీటీసీ విజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల, టౌన్ అధ్యక్షులు మఠం రాచయ్యస్వా మి, ఏజాజ్బాబా, ఆత్మకమిటీ అధ్యక్షుడు విజయ్‌కుమార్, మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, టీఆర్ఎస్ నాయకులు సంగమేశ్వర్, నాగన్నపటేల్, సిద్ధన్న పటేల్, నర్సింహులు, బస్వరాజ్, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి కేక్‌కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కల్హేర్ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, టీఆర్ఎస్వీ డివిజన్ అధ్యక్షుడు అంజాగౌడ్, మనూరు మండలాధ్యక్షుడు విఠల్‌రావు, రైతుబంధు సమితి మనూరు మండలాధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, నాయకులు సంజీవ్‌రెడ్డి, దత్తు, ప్రశాత్సాగర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రమైన మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.
అనంతరం మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో జిల్లా దవాఖానలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, మాజీ ఏఎంసీ చైర్మన్ మధుసూదన్‌రావు, కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్, సమీయొద్దీన్, మాజీ కౌన్సిలర్లు ముత్యంగౌడ్, పేర్క కిషన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, గడ్డమీది కృష్ణాగౌడ్, నాయకులు లింగారెడ్డి, జీవన్‌రావు, శివరామకృష్ణ, కొండ శ్రీనివాస్, దుర్గప్రసాద్, ప్రవీణ్‌గౌడ్, బొద్దుల కృష్ణ, సంగ శ్రీకాంత్, ఉమర్, నవీన్, రాజు, సంశాన్ సందీప్, ప్రసాద్, బండ నరేందర్, గోపాలకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కేక్‌కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్‌గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్‌ఖాన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.