కంగ్టి, మే 30: లింగాయత్ సమాజ్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కంగ్టిలో నూతనంగా నిర్మించిన బసవేశ్వర విగ్రహాన్ని భాల్కి హీరేమఠ్ సంస్థాన్ పీఠాధిపతి గురుబసవ పట్టదేవర, మల్లయ్యగిరి ఆశ్రమ పీఠాధిపతి బసవలింగ అవధూతగిరి మహరాజ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. ఇక్కడి ప్రాంత లింగాయత్‌ల కోరిక మేరకు కంగ్టితోపాటు మండలంలో నాగూర్(బి), చాప్టా(కె), చౌకన్పల్లి, తడ్కల్ తదితర గ్రామాల్లో బసవ మండపాలను మం జూరు చేసి నిర్మించారన్నారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వర విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పేర్కొన్నారు. రూ. 10 కోట్ల నిధులతో హైదరాబాద్‌లో బసవ మండపాన్ని నిర్మిస్తామని తెలిపారు. నారాయణఖేడ్ ప్రాంతంలో కాళేశ్వరం నీటితో ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం ఇటీవల రూ. 1774 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. దాని పేరును సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ బసవేశ్వర ఎత్తిపోతల పథకంగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. లింగాయత్‌ల కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని క్రాంతిచౌక్ నుంచి బసవేశ్వర విగ్ర హం వరకు ర్యాలీగా తీసుకువెళ్లారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ్‌పాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సంగీతాశెట్కార్, కంగ్టి ఎంపీపీ సంగీతావెంకట్రెడ్డి, కంగ్టి జడ్పీటీసీ లలితాఆంజనేయులు, లింగాయత్ సమాజ్ బాధ్యులు బైరే అశోక్, రాజుపాటిల్, పట్నె సంతోశ్, కోటే సంతోశ్, చన్బసప్ప, జగన్నాథ్, గూలే సతీశ్, సంగప్ప, ఉమాకాంత్ పాల్గొన్నారు.
బసవేశ్వరుని తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని మల్లయ్యగిరి ఆశ్రమ పీఠాధిపతి బసవలింగ అవదూతగిరి మహరాజ్ అన్నారు. బసవేశ్వర విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ 12వ దశాబ్దంలోనే బసవేశ్వరుడు అనుభవ మండపాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కుల మత భేదాలు లేకుండా ప్రతిఒక్కరికీ బసవేశ్వరుడు సముచిత స్థానాన్ని కల్పించారని పేర్కొన్నారు. బసవేశ్వరుడు అనుసరించిన మార్గంలో పయనించాలని సూచించారు. ప్రతిరోజూ నియమనిష్టలతో లింగపూజ చేపట్టాలని, ఇది మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని వెల్లడించారు. ఆయా గ్రామాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
నారాయణఖేడ్, మే 30: నియోజకవర్గంలోని జర్నలిస్టులకు త్వరలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే అమెరికా పర్యటన ముగించుకొని నారాయణఖేడ్‌కు వచ్చిన సందర్భంగా సోమవారం స్థానిక జర్నలిస్టులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ను కలుసుకుని సన్మానించిన సందర్భంగా మాట్లాడారు.
నియోజకవర్గంలోని జర్నలిస్టుల జాబితాను అందజేసిన పక్షంలో డబుల్ బెడ్రూం కోసం ప్రతిపాదనలు సమర్పించి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించే విధంగా చూస్తానన్నారు. నారాయణఖేడ్‌తో పాటు అన్ని మండలాల విలేకరులకు నారాయణఖేడ్‌లోనే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టు జేఏసీ బాధ్యులు శ్రీకాంత్, అలీమ్మియా, అమృతం, రవీందర్శెట్కార్ పాల్గొన్నారు.
నారాయణఖేడ్, మే 30: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం వర్తించని పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన నిరుపేదలను ఆదుకునే దిశగా సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయమందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలోని వేలాది మందికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేసినట్లు చెప్పారు.