మెదక్ అర్బన్, ఆగస్టు 5: మెదక్ జిల్లా న్యాయస్థాన సముదాయంలో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శుక్రవారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయస్థాన సముదాయంలో న్యాయవాదులు, బ్యాంకు స్టాండింగ్ కౌన్సిల్స్, ఇన్సూరెన్స్ కంపెనీ స్టాండింగ్ కౌన్సిల్స్‌లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్నచిన్న గొడవలకు కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. రాజీ చేసుకోవడం వలన ఇరువురికీ న్యాయం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్‌లో కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని తెలిపారు.
కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి జితేందర్, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కల్పన, మెదక్ జ్యుడీషియల్ ఇన్చార్జి మేజిస్ట్రేట్ అనిత, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలయ్య, న్యాయవాదులు మయా వేంకటేశం, ఆర్.సిద్దిరాములు, శ్రీపతిరావు, శ్రీనివాస్‌గౌడ్, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.