చిన్నశంకరంపేట, ఆగస్టు5: దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని చందంపేటలో దళితబంధు పథకంలో ఆరుగురు లబ్ధిదారులు ఏర్పాటుచేసిన డెయిరీ ఫారాలను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారన్నారు. మెదక్ నియోజకవర్గానికి దళితబంధు పథకంలో 100 యూనిట్లు అందజేసినట్లు తెలిపారు. దశలవారీగా ప్రతి దళిత కుటుంబానికీ దళిత బంధు పథకాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కృషి చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, సర్పంచ్‌లు శ్రీలతా రాజిరెడ్డి, దయానంద్ యాదవ్, ఉప సర్పంచ్ జీవన్, నాయకులు స్వామిరాజ్, శ్రీనివాస్ పోశాగౌడ్, బాగారెడ్డి, రమేశ్‌గౌడ్, లాలూనాయక్, నరేశ్, స్వామి, రాజు, యాదగిరి, నరేశ్ మండంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చేగుంట, ఆగస్టు5: నార్సింగి మండలం జెప్తిశివునూర్ గ్రామానికి చెందిన 30 మంది యువకులు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. గ్రామ అధ్యక్షుడు యాదగిరి యాదవ్, వైస్ ఎంపీపీ దొబ్బల సుజాతా శంకర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట పార్టీ అధ్యక్షుడు పట్లోరి రాజు తదితరులు ఉన్నారు.