మెదక్ మున్సిపాలిటీ, జూలై 24: సమస్త జీవకోటికి చెట్లే ఆధారమని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ అన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని జేఎన్ రోడ్డులో పాలకవర్గం, మెప్మా మహిళలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్లకు ప్రకృతితో అనుబంధం ఉంటుందని, మానవళి మనుగడకు చెట్లు మెట్లు లాంటివని, వృక్షాలను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయన్నారు.
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. భావితరాల మనుగడ కోసం పర్యావరణ పరంగా ప్రభుత్వం చేపట్టిన హరిత హారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బంగారు భవిష్యత్ ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని అన్నారు. కేటీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ కోసం అడుగులో అడుగు వేసి నడుస్తామన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మాజీ మున్సిపల్ చైర్మ న్ అశోక్, మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, సుంకయ్య, కిశోర్, సమియొద్దీన్, వసంత్‌రాజ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డీఈ మహేశ్ ఏఈలు బాలసాయగౌడ్, సలీం, మాజీ కౌన్సిలర్లు ముత్యంగౌడ్, పేర్క కిషన్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ పురం వెంకటనారాయణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, గడ్డమీది కృష్ణాగౌడ్, నాయకులు లింగారెడ్డి, శ్రీధర్‌యాదవ్, గోదల సాయి, శివరామకృష్ణ, మధు, సురేశ్, బాల్‌రాజు, ప్రసాద్ పాల్గొన్నారు.
నిజాంపేట, జూలై24: మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిజాంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరి, మండల టీఆర్ఎస్ నాయకులు కేక్‌కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంచుకుని, కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో మండల ఎం పీటీసీలు లహరి, బాల్‌రెడ్డి, సురేశ్, పీఏసీఎస్ డైరెక్టర్లు కిష్టారెడ్డి, అబ్దుల్ఆజీజ్, వార్డు సభ్యుడు తిరుమల్‌గౌడ్, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మావురం రాజు, గ్రామ అధ్యక్షు డు నాగరాజు, నందిగామ మాజీ సర్పంచ్ సంగుస్వామి, నా యకులు లక్ష్మీనర్సింహులు, రాములు, నగేశ్ ఉన్నారు.