చేగుంట, జూన్15: ఆలయాల అభివృద్ధికి తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చేగుంట వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాయంలోని షెడ్డు నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయ 17వ వార్షికోత్సవ వేడుకలు చేగుంట ఆర్యవైశ్య సంఘం, అనంతసాగర్ సరస్వతీ క్షేత్ర నిర్మాత అష్టకాల నరసింహ రామ శర్మ, యాజ్ఞికుడు జనమంచి సీతారామ శర్మ, శివునూరి రామనాథశర్మ, సుధాంశు జ్యోషిల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
పంచముఖ ఆంజనేయ స్వామికి మన్యసూక్తాభిషేకం, అమ్మవారికి చెప్పన్భోగ్ (54 రకాలు) నైవేద్య నివేదన, ప్రత్యేక కన్యకాపూజ, సువాసిని పూజ, నగరేశ్వ స్వామి శివపార్వతుల కల్యాణోత్సవం, ఆశీర్వచనం, ఒడిబియ్యం సమర్పణ, తీర్థప్రసాద వితరణ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యు లు, పురోహితులు ఎంపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలతో పాటు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.
రెడ్డిపల్లి, తూప్రాన్, రామాయంపేట చౌరస్తాల వద్ద రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారని, ప్రమాదాల నివారణకు బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని పలు రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించినట్లు, దు బ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ వేడుకల్లో ఆర్యవైశ్య సం ఘం పట్టణ శాఖ అధ్యక్షుడు తొడుపునూరి నగేశ్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాడెం వెంగళ్రావు, మైలరాం బాబు, చేగుంట సొసైటీ చైర్మన్ సండ్రుగు స్వామి, డైరెక్టర్ రఘురాములు, రంగయ్యగారి రాజిరెడ్డి, ఇబ్రహీంపూర్ సొసైటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పట్నం తానీషా, మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజు, అంచనూరి రాజేశ్, ఆలయ కమిటీ సభ్యులు హనుమయ్య, రాజేశ్వర్, నాగభూణం, బాలేశం, భాస్కర్, మహేశ్, గొలి అశోక్, కూన రాములు, బచ్చు రమేశ్, వెంకటరమణ, చందవీరేశం, చందు, బక్కి రమేశ్ పాల్గొన్నారు.