సిద్దిపేట అర్బన్, జూన్ 13: ప్రజావాణి కార్యక్రమానికి అధికా రులంతా తప్పక హాజరై ప్రజలకు నమ్మకం కలిగేలా సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని జిల్లా స్థాయి అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం లో అధికారులతో కలిసి ప్రజావాణిలో భాగంగా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులు ప్రజావాణికి హాజరై సంబంధిత శాఖలకు చెందిన పిటిషన్లు వచ్చినప్పుడు దానిని పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కరించాల న్నారు. జిల్లాలోనే వివిధ శాఖల వారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని, పూర్తి సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో రెవెన్యూ డివిజన్ల వారిగా వచ్చిన దరఖాస్తులను ఆయా టేబుళ్ల వద్దకు వెళ్లి పరిశీ లించారు. ప్రజావాణికి మొత్తం 56 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, ఏవో అబ్దుల్ రహమాన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.