మెదక్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : జవాబుదారీగా అధికారులు పనిచేయాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. మెదక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజల నుంచి ఆయన 65 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయ న మాట్లాడారు.
రానున్న ప్రజావాణిలో ఏఏ శాఖ వద్ద ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో తెలుపాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ధరణి 17, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 4 , ఇతర సమస్యలపై 44 దరఖాస్తులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.