మెదక్ రూరల్, జూలై 04: మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలంలోని ఎరువుల దుకాణాల్లో శుక్రవారం మెదక్ ఏడీ విజయ నిర్మల తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో స్టాక్ రిజిస్ట్రర్లు, బిల్ బుక్కులను పరిశీలించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసిన సమయంలో విధిగా బిల్లులు ఇవ్వాలని, దుకాణాల ఎదుట ధరల పట్టిక ఏర్పాటు చేయాలని దుకాణాల నిర్వాహకులకు సూచించారు.
ఎరువుల దుకాణాల తనిఖీల అనంతరం పంట పొలాల్లో వరి నాట్లు, నారుమడులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పొలంలో నీరు నిల్వకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు పలు సూచనలు చేశారు.