
చేగుంట/చిన్నశంకరంపేట/నిజాంపేట/పాపన్నపేట/మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ కొల్చారం/ పెద్దశంకరంపేట/ నర్సాపూర్/ రామాయంపేట ఆగస్టు 22 : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. కొల్చారం మండల వ్యాప్తంగా ఆదివారం రాఖీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. కొల్చారం శివాలయంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని సంఘమిత్ర యువజన సభ్యులు నిర్వహించారు. పెద్దశంకరంపేట శ్రీ సరస్వతీ శిశుమందిరంలో సామూహిక రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్‌కు శిశుమందిర్ విద్యార్థులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
మహంకాళి మార్కెట్ సందడి
రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అయ్యప్ప ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏఎంసీ దంపతులు చైర్మన్‌కు రాఖీ కట్టారు. కాట్రియాల, డి.ధర్మారం, అక్కన్నపేట తదితర గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెదక్‌లో రాఖీ దుకాణాలు కిటకిటలాడాయి. మెదక్ పట్టణం, తూప్రా న్, నర్సాపూర్, రామాయంపేట, చేగుంట పట్టణాల్లో రాఖీ దుకాణాల వద్ద మహిళలు బారులు తీరారు.
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
మెదక్ జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలత, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నిజాంపేట మండల ప్రజలకు ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. చేగుంటలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌కు సోదరీమణులు రాఖీలు కట్టారు. నార్సింగి మండలం వల్లూర్‌లో సోదరుడుకి ఎంపీపీ చిందం సబిత రాఖీ కట్టారు. నార్సింగిలో ఎంపీటీసీ ఆకుల సుజాత, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్ రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేగుంట, నార్సింగిలోని పలు మిఠాయి దుకాణాలు సందడిగా కనిపించాయి.