
మెదక్ అర్బన్, ఆగస్టు 21: నేరస్తులకు శిక్ష పడేలా కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులు కృషిచేయాలని జిల్లా శిక్షణ ఇన్చార్జి అల్లాదుర్గం సీఐ జార్జ్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధానకార్యాలయంలో జిల్లా ఎ స్పీ ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ నిర్వహించే పోలీస్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ జా ర్జ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో పని చే స్తున్న కోర్టు కానిస్టేబుల్ వీధిలో భాగం గా ఎప్పటికప్పుడు ఎన్బీడబ్ల్యూ క్రమం తప్పకుండా అమలు పరిచి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా కృషిచేయాలన్నారు. సరియైన సమయంలో సమాన్లు జారీ చేయాలని సూచించారు. కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, నేర రహిత సమాజంగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్ష పడే విధంగా కోర్టు పోలీస్ సిబ్బంది శ్రమించాలని, ఇందుకోసం ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుంచి కేసు పూర్తయేవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలాన్ని కోర్టు కు సమర్పించడంలో కోర్టు పోలీస్ అధికారుల పనితీరులో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు. కోర్టు నందు ఎఫ్ఐఆర్లను సరైన సమయంలో అందించాలన్నారు. కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీని సరైన సమయంలో కోర్టునందు డిపాజిట్ చేయాలన్నారు. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా నేరస్తులకు వారం ట్, సమన్స్, సత్వరమే ఎగ్జిక్యూటీవ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కోర్టు సమాచారం ప్రాసిక్యూషన్కు సంబందించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కుకు తెలియజేయాలని కోర్టు క్యాలెండర్ ఎప్పటికప్పుడు అఫ్టేడ్ చేయాలన్నారు. కేసు ట్రయల్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు సూచనలు స్వీకరించాలన్నారు. కోర్టు పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్ , సమన్స్ , సీసీటీఎస్లో సీఎంఎస్ కోర్టు మానిటర్ సిస్టంలో డాటా ఎంటర్ చేయాలని సూచించారు. ఈ డాటాను టీఎస్ కాప్కు అనుసంధానం చేస్తామన్నారు. దీనితో ప్రతిరోజు కోర్టు ప్రాసెస్ ఎలా జరుగుతుందని ఆన్లైన్లో తెలుస్తుందన్నారు. కో ర్టు కానిస్టేబులు పని సులభతరం అవుతుందని పేర్కొన్నా రు. ప్రతిరోజు కోర్టులో ట్రయల్ జరిగిన కేసులు ఎంటర్ చేసినచో పెండింగ్ లేకుండా ఉంటుందని సూచించారు. కోర్టు కానిస్టేబులు బాధ్యతాయుతంగా వ్యవహరించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, బాధితులకు మరింత నమ్మకం పెరిగేలా ప్రతీ ఒక్క అధికారి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కోర్టు కానిస్టేబుళ్లు , ఐటి.కోర్ సిబ్బంది లయక్ అలీ, అనిల్ పాల్గొన్నారు.