
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 12: కార్యకర్తలు, నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ అన్నా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 15, 30వ వార్డుల్లో ఏర్పాటు చేసిన వార్డు కమిటీ సమావేశాల్లో పాల్గొన్ని మాట్లాడారు. పార్టీకోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నా రు.కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీ సుకెళ్లలన్నారు. ప్రతి రెండేళ్లకోసారి వార్డు కమిటీలు, గ్రామ, పట్టణ, మండల జిల్లా కమిటీలు వేసుకోని రాష్ట్ర కమిటీ ఎన్నుకుంటున్నామన్నారు. కమిటీల్లో అవకాశం రాని వారు నిరుత్సాహ పడరాదన్నారు. 15వ వార్డు కౌన్సిలర్ గాయత్రి, 25వ వార్డు కౌన్సిలర్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా 15, 30వ వార్డు కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 15 వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా శంకర్, కార్యదర్శిగా రాజు, యువత అధ్యక్షుడిగా మల్లారెడిపేట గణేశ్, కార్యదర్శిగా దుర్గేశ్, మహిళా అధ్యక్షురాలుగా దొంతి అనిత, కార్యదర్శిగా బాలమణి, మైనార్టీ అధ్యక్షుడిగా ఫజల్, కార్యదర్శిగా అక్బర్ అలీ, రైతు అధ్యక్షుడిగా బొందుగుల కిషన్, కార్యదర్శిగా అబ్బయ్యలతో పాటు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 30 వార్డు కమిటీ అధ్యక్షుడిగా వెంకటేశ్, కార్యదర్శిగా తూర్పు శ్రీను, యువత అధ్యక్షుడిగా నగేశ్, కార్యదర్శిగా సంగమేశ్, మహిళా అధ్యక్షరాలుగా బాబమ్మ, కార్యదర్శిగా కవిత, మైనార్టీ అధ్యక్షుడిగా వాజిద్, రైతు అధ్యక్షుడిగా బాలయ్య, కార్యదర్శిగా మల్లేశంలతో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ కిషన్, టీఆర్ఎస్ నాయకులు విఠల్‌గౌడ్, రమేశ్, ప్రసాద్, బాలరాజు, గట్టేశ్, నర్సింహులు, దశరథ్, వెంకటేశ్, ప్రసాద్, సంజీవ్‌గౌడ్, సిద్ధ్దిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.
కూచన్‌పల్లి గ్రామ కమిటీ ఎన్నిక
హవేళీఘనపూర్, సెప్టెంబర్ 12: మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామ టీఆర్ఎన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ యువ నాయకులు వెంకట్రాంరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మల్లయ్య, యూత్ ప్రెసిడెంట్‌గా పాండరిగౌడ్ను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవాగౌడ్ , దమ్ము వెంకటేశ్‌గౌడ్, ఉపసర్పంచ్ బయ్యన్నలు ఉన్నారు. తమ ఎన్నికకు కృషి చేసిన ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎంపీపీ నారాయణరెడ్డిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
చేగుంటలో…
చేగుంట, సెప్టెంబర్12: చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నికలు ఇబ్రహీంపూర్లో మాజీ సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్ రా ములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇబ్రహీంపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నర్సింహులు, ఉపాధ్యక్షులుగా వడ్డె కనుకయ్య, మైసన్నగారి రవి, ప్రధాన కార్యదర్శి నవిన్, సోమ్లా తండాలో గ్రామకమిటీ అధ్యక్షుడిగా గు గ్లోత్ సుభాష్, ఉపాధ్యక్షుడిగా మాలోత్ హరిలాల్ ,ప్ర ధాన కార్యదర్శిగా గుగ్లోత్ రవీందర్ ఎన్నికయ్యారు. పొలంపల్లిలో సర్పంచ్ నిర్మల ఆధ్వర్యంలోటీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా సిద్ద్ధిరాములు, ఉపాధ్యక్షుడిగా దుర్గయ్య, ప్రధాన కార్యదర్శిగా పులిమామిడి వెంకటేశం ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంగళ్రావు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సత్యం,మాజీ సర్పంచ్ మల్లేశం, నాయకులు చౌడం నర్సింహులు, మామిడి రాజు, చంద్రం, శేఖర్ ఉన్నారు.
నార్సింగి మండలంలో….
నార్సింగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నికలో అధ్యక్షుడిగా విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుగా నవీన్, ప్ర ధాన కార్యదర్శిగా భూపతిరాజు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తౌర్యనాయక్, ఎంపీ పీ సబిత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు అశోక్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ శంకర్‌గౌడ్ , సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.