
టేక్మాల్: మొక్కలను విరివిగా నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని బొడ్మట్‌పల్లి, సాలోజిల్లి గ్రామాల్లో మొక్కలను నాటారు. అనంతరం ఇంటింటికీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతిలో భాగంగా చేపడుతున్న పనులు స్వయంగా పర్యవేక్షించారు. గ్రామాలు స్వచ్ఛత వైపు పయనించాలని, గ్రామాలు పట్టణాలతో సమానంగా అభివృద్ధి వైపు బాటలు వేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల సమాగ్రాభివృద్ధికి బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు యూసూఫ్, తాసీల్దార్ గ్రేసీబాయి, ఎంపీడీవో హిరణ్మయి, సర్పంచ్ స్వరూప, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరప్ప, ప్రధానకార్యదర్శి అవినాశ్, నాయకులు బసంతరావు, శ్రీధరాచారి, సిద్ధయ్య, భాస్కర్, శ్రీనివాస్, సాయి ఉన్నారు.
మొక్కలు నాటిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ మున్సిపాలిటీ, జూలై 8: జిల్లా కేంద్రంలో 8వ రోజు గురువారం పట్టణ ప్రగతి జోరుగా సాగింది. పట్టణంలోని 2, 6, 11, 13, 19, 25 వార్డులలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సందర్శించి వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిశీలించి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. 11, 13, 25 వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్లు సులోచన ప్రభురెడ్డి, సమియొద్దీన్, అకిరెడ్డి కృష్ణారెడ్డిలతో కలిసి మొక్కలు నాటి మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. వైకుంఠధామానికి స్థలం కేటాయించాలని అదనపు కలెక్టర్‌కు కౌన్సిలర్ సులోచన ప్రభురెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం డ్రై రిసోర్స్ సెంటర్‌ను సందర్శించి తడి, పొడి చెత్త వేరు చేసిన వ్యర్థాలను పరిశీలించారు. మున్సిపల్ డీఈ మహేశ్, ఏఈలు బాలసాయగౌడ్, టీపీఎస్ లక్ష్మీపతి, శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, మున్సిపల్ సిబ్బంది బట్టి చంద్రమోహన్, శివ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, టీఆర్ఎస్ నాయకులు ప్రభురెడ్డి, సునీల్ పాల్గొన్నారు.
పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని లింగ్సాన్‌పల్లి, తిమ్మాయిపల్లి గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రకృతివనం, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఎంపీడీవో శ్రీరామ్, సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, శివ్వమ్మ, ఎంపీవో ప్రవీణ్, ఏపీవో రాజ్‌కుమార్, పంచాయతీ సెక్రటరీ నవీన్, రేణుక, టీఆర్ఎస్ నాయకులు రాజు ఉన్నారు.