
తూప్రాన్ రూరల్, జూలై 7 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణప్రగతిలో తూప్రాన్ పట్టణాన్ని సుందరీకరించి, ఆదర్శంగా తీర్చిదిద్దాలని మెకద్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్‌బాడీస్)ప్రతిమాసింగ్ సూచించారు. పట్టణంలోని ఆయా వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్, ఆర్డీవో శ్యాంప్రకాశ్, కమిషనర్ మోహన్‌తో కలిసి బుధవారం ఆమె పర్యటించి పట్టణప్రగతి పనులను పరిశీలించారు. పట్టణ రహదారికి ఇరువైపులా, గజ్వేల్, నర్సాపూర్‌లకు వెళ్లేమార్గంలో నాటిన హరితహారం మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణప్రగతిలో చేపట్టిన, చేపట్టాల్సి పనులను కమిషనర్ నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్బన్‌పార్కు, వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, మున్సిపల్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఆయా వార్డుల్లోని ఇండ్ల పరిసరాల్లో ముండ్లపొదలు, గడ్డిని తొలగించి శుభ్రం చేసి స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి వార్డు, కాలనీల్లో హరితహారం మొక్కలను నాటి సంరక్షించే బాధ్య త కౌన్సిలర్లదే అన్నారు. అంతకుముందు మున్సిపల్ చైర్మన్, ఆర్డీవో, కమిషనర్‌తో కలిసి హరితహారం మొక్కలు నాటారు. ఆమె వెంట మున్సిపల్ ఆర్ఐ రమేశ్, వార్డుల ప్రత్యేకాధికారులు, పట్టణ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
నాగులపల్లి, వట్టూర్‌లో..
మండలంలోని నాగులపల్లి, వట్టూర్లలో బుధవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో నిర్మించిన డంపింగ్‌యార్డులు, పల్లెప్రకృతి వనాల నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట ఎంపీడీవో అరుంధతి, ఎంపీవో రమేశ్, ఈజీఎస్ ఏపీవో సంతోష్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.