
చిన్నశంకరంపేట, జూలై 7: దేవాలయాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సీఎం రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని దర్పల్లిలోని శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, హనుమాన్ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను శ్రీ మాధవానంద సరస్వతీస్వామి నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత నెలకొంటుందన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని శ్రీమాధవానంద సరస్వతీ స్వామి సూచించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గవ్వలపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పట్లోరి మాధవి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు పట్లోరి రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గంగానరేందర్, ఎంపీటీసీ రాణమ్మ, మాజీ ఎంపీటీసీ శ్రీను, పురుషోత్తంరెడ్డి, జీవన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.