
పెద్దశంకరంపేట, డిసెంబర్ 14 : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని మెదక్ డీఎస్పీ సైదులు సూచించారు. మంగళవారం పెద్దశంకరంపేట పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దశంకరంపేట మం డల పరిధిలోని 161వ జాతీయ రహదారిపై ఎవరూ రాంగ్రూట్లో వెళ్లొదన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మహత్యల నివారణ కోసం గ్రామా ల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పోలీసులు ప్రజలతో మమేకమై సేవాధృక్పదంతో విధులు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో నేరస్తులను త్వరగా పట్టుకోవచ్చన్నారు. మెదక్ డివిజన్ పరిధిలో లోక్ అదాలత్ ద్వారా 629 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. సమావేశంలో అల్లాదుర్గం సీఐ జార్జ్, పేట ఎస్సై నరేందర్, రేగోడ్ ఎస్సై సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.