రామాయంపేట, ఫిబ్రవరి 24: మనిషి జీవితానికే వెలుగునిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట పురపాలక చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, కమిషనర్ ఉమాదేవి అన్నారు. శుక్రవారం రామాయంపేటలోని 9వ వార్డులో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించి అద్దాలను పంపిణీ చేశారు. కౌన్సిలర్ జయ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 9వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం కంటి చికిత్సతో పాటు అద్దాలను, మందులను కూడా ఉచితంగా అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, డి. ధర్మా రం పీహెచ్సీ వైద్యురాలు హరిప్రియ, వైద్యురాలు శ్రావణి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్ శ్రీనివాస్, ఆప్తమాలజిస్టు నర్సింహులు, కిషన్, సూపర్వైజర్ సునంద, బీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, మల్యాల కిషన్, దేవుని రాజు, బొర్ర అనిల్, ఎంఆర్పీలు లావణ్య, రజిత, బాలమణి, డీఈవో భరత్, ఏఎన్ఎంలు బాలమణి, లక్ష్మి, రమ, ఆశవర్కర్లు లక్ష్మి, పద్మా, శోభ ఉన్నారు.
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 24: కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయిసింకొచ్చెరుతండాలో..
హవేళీఘనపూర్, ఫిబ్రవరి 24: ప్రభుత్వం చేపట్టిన కం టి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నా రు. శుక్రవారం మండలంలోని కొచ్చెరుతండాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ జెమ్లానాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అంధత్వ నివారణ కోసం చేపట్టిన కార్యక్రమం లో ప్రజలకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు శ్రీనునాయక్, తండావాసులు ఉన్నారు.
కంటి వెలుగును విజయవంతం చేయండి
అల్లాదుర్గం, ఫిబ్రవరి 24: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగును విజయవంతం చేయాలని మాజీ ఎంపీపీ కాశీనాథ్ పేర్కొన్నారు. మండలంలోని ము స్లాపూర్లో నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ అవకాశాన్ని అవసరమైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.