రాయపోల్ : నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా ( Mega Job Mela ) ను సద్వినియోగం చేసుకోవాలని రాయపోల్ ఎస్సై మానస( Manasa ) , దౌల్తాబాద్ ఎస్సై జి.అరుణ్ కుమార్ ( Arun Kumar ) కోరారు. సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర మెగా జాబ్ మేళాపై ఆదివారం రెండు మండలాలలో అవగాహన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెరీర్ను నిర్మించడం – భవిష్యత్తును సురక్షితం చేయడం అనే ఇతివృత్తంతో యువతకు ఉద్యోగ అవకాశాలపై దృష్టిని సారించాలని వివరించారు. జాబ్ మేళాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితమని, అర్హతల ఆధారంగా పలు సంస్థల్లో ఖాళీల భర్తీ జరుగుతుందని తెలిపారు. నమోదు విధానం, ఎంపిక ప్రక్రియ, అవసరమైన అర్హతలు వంటి కీలక అంశాలపై యువతకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి మార్గాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు.