సిలిండర్ దగ్గర కిరోసిన్, మండే పదార్థాలు ఉంచకూడదు
ఎండాకాలం జాగ్రత్తలు పాటించాలి
ప్రమాదాలు జరిగిన వెంటనే సమాచారం ఇవ్వాలి
అగ్నిమాపక శాఖ అధికారి శ్రీశైలం
అందోల్, మే 9 : ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వినియోగం సర్వ సాధారణమైంది. ఒక్క పూట గ్యాస్ లేకపోతే వంట చేసేందుకు తంటాలు పడాల్సి వస్తున్నది. గృహిణులు వంట చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పా టిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని గ్యాస్ కం పెనీలు, ఫైర్ సిబ్బంది సూచిస్తున్నారు. మా మూలు రోజులతో పోల్చితే ఎండాకాలం లో ఎక్కువగా గ్యాస్ సిలిండర్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో తమ సలహాలు, సూచనలు పాటిస్తూ వంట గదు ల్లో మార్పులు చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
వంటగదిలో ఇలా ఉండాలి
వంట గదిలో తగినంత గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు ఉండాలి. గదిలో గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉండాలి. కిరోసిన్‌తో పాటు ఇతర మండే పదార్థాలు ఉంచకూడదు. వంట చేసేటప్పుడు ఆహార పదార్థాలు ట్యూబ్‌పై (పైపు) పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితిలో సిలిండర్‌ను తొలిగించేందుకు వీలుగా ఉండాలి. చాలామంది మహిళలు పిల్లలను ఎత్తుకుని వంట చేస్తుంటారు. ఎట్టి పరిస్థితిలో వంటగదిలోకి పిల్లలను రానివ్వకూడదు. గ్యాస్ వాసన వస్తుంటే వెంటనే సంబంధిత కంపెనీ సిబ్బందికి సమాచారం అందించాలి. సిలిండర్ ఎప్పుడూ నిలువుగా ఉంచాలి. పక్కకు వంచి ఉంచకూడదు. వంట పూర్తైన వెంటనే రెగ్యులేటర్‌ను కట్టివేసి మంట పూర్తయ్యే వరకు గమనించాలి. సిలిండర్ వినియోగించని సమయంలో ప్లాస్టిక్ మూత పెట్టాలి. ఖాళీ సిలిండర్‌కు కంపెనీ ఇచ్చే మూతను పెట్టడం మరువకూడదు. నా ణ్యమైన స్టౌలు వాడడంతో ఏడాదికి రెండు సిలిండర్లు ఆదా చేయవచ్చు. సిలిండర్‌లో లీకేజీ వస్తే దానిలో ట్యూబ్‌ను మార్చాలి. వాడే ట్యూబ్‌లు డీలర్ సిఫార్సు చేసినవి వాడితే నాణ్యతతోపాటు ఎక్కువ రోజులు వస్తాయి.
సిలిండర్ కాల పరిమితిని తెలుసుకోవచ్చు
సిలిండర్ కాల పరిమితి సూచించే నంబర్‌ను పరిశీలించాలి. సిలిండర్‌కు అతికించి ఉన్న ఊ చల వెనుక ఏ-23, బీ-23, సీ-23, డీ- 23 అని నంబర్లు ఉంటాయి. ఏ- అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, బీ- అంటే ఏప్రిల్, మే, జూన్, సీ-అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, డీ-అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని అర్థం.
జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించవచ్చు
వంటింట్లో సంభవించే అగ్ని ప్రమాదాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. వంటింట్లో కిటికీలు పూర్తిగా తెరిచి ఉంచాలి. రెగ్యులేటర్ ఆపేసి తడిగుడ్డ తో మంటపై కప్పి ఉంచితే అగ్నిప్రమా దం జరుగకుండా ఉంటుంది. జోగిపేట ఫైర్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు జరిగితే వెంటనే 08450-272199, 8712699386, 9440488441 నంబర్లలో ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.
– శ్రీశైలం, జోగిపేట అగ్నిమాపక కేంద్రం అధికారి