దుబ్బాక/మెదక్ అర్బన్, డిసెంబర్ 14: సమస్యల సత్వర పరిష్కారానికి లోక్అదాలత్ నిర్వహిస్తున్నామని దుబ్బాక జూనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జి జడ్జి పి. చందన సూచించారు. గురువారం దుబ్బాక మండలంలోని దుబ్బాక, తొగుట సర్కిల్ పోలీసులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. పోలీసు అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 30న జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నందున పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు.
కార్యక్రమంలో సీఐ మున్నురు కృష్ణ, దుబ్బాక, మిరుదొడ్డి, భూంపల్లి, తొగుట ఎస్సైలు గంగారాజు, నరేశ్, భువనేశ్వర్, లింగం, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈనెల 30న మెదక్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహిస్తామని జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి జితేందర్ తెలిపారు.