వంతెన.. వర్రీ!
నిత్యం రోడ్డు ప్రమాదాలకు జరగుతున్న 65 జాతీయ రహదారిని ప్రమాదరహితంగా రూపొందించాలని పదేండ్ల క్రితం నాలుగు లేన్ల విస్తరణ చేపట్టారు. సంగారెడ్డి నుంచి షోలాపూర్ వరకు జాతీయ రహదారి విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని దిగ్వాల్లో పనులు ప్రారంభించారు.
- వంతెన కోసం దిగ్వాల్ టూ ఢిల్లీకి
- కేంద్ర మంత్రికి విన్నవించిన ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు
- ప్రమాదాలతో ఇప్పటి వరకు 40 మంది వరకు మృతి
కోహీర్, ఆగస్టు 22: నిత్యం రోడ్డు ప్రమాదాలకు జరగుతున్న 65 జాతీయ రహదారిని ప్రమాదరహితంగా రూపొందించాలని పదేండ్ల క్రితం నాలుగు లేన్ల విస్తరణ చేపట్టారు. సంగారెడ్డి నుంచి షోలాపూర్ వరకు జాతీయ రహదారి విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని దిగ్వాల్లో పనులు ప్రారంభించారు. రహదారికి ఇరువైపులా ఉన్న ఇండ్ల యజమానులు, దుకాణాదారులకు పరిహారం చెల్లించారు.
కానీ, కొంతమందికి పలు కారణాలతో పరిహారం అందలేదు. జాతీయ రహదారుల సంస్థ, ఎల్అండ్టీ ఆధ్వర్యంలో రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించింది. కానీ, వంతెన నిర్మించే సమయంలో కొంతమంది నిరాకరించడంతో పనులు మధ్యలోనే ఆపేశారు. దీంతో వాహనాల వేగం అధికంగా ఉండడం, వేగ నియంత్రణ లేక ఇప్పటికే 40మందికి పైగా ఇక్కడ మృతిచెందారు. మరిన్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వంతెన నిర్మించాలి
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామ జాతీయ రహదారిపై 90ఫీట్ల వంతెన నిర్మించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేశారు. వంతెనతో పాటు రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు, మురుగు నీరు బయటకు పంపించేందుకు డ్రైనేజీ నిర్మించాలని సంబంధిత ప్రతినిధులకు సూచించారు. దీంతో తాము ప్రతిపాదనలు తయారు చేస్తామని బదులిచ్చారు.
దిగ్వాల్లోని జాతీయ రహదారి పక్కన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు జీఎంఆర్ కళాశాల, పాఠశాల, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాల, పిరామల్ పరిశ్రమ, నిప్పొన్ గ్యాస్ పరిశ్రమ ఉండడంతో రోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. జాతీయ రహదారిపై వంతెన లేక రోడ్డు దాటాలంటే చెమటలు పట్టాల్సిందే. 90ఫీట్ల వెడల్పుతో కూడిన వంతెన, సర్వీస్ రోడ్డు, డ్రైనేజీ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న ఇండ్లు, దుకాణాల యజమానులకు పరిహారం చెల్లించి వెంటనే పనులు ప్రారంభించాలని, వెంటనే ప్రమాద నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

