మెదక్ జిల్లాలో సోమవారం మేడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు పలు ప్రాంతాల్లో జెండావిష్కరణలు చేశారు. వీధుల గుండా ర్యాలీలు తీశారు. నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు ఆలోచించేది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్కేవీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పటోళ్ల మల్లిక అన్నారు. జిల్లా కేంద్రంలో కార్మిక జెండాను ఆవిష్కరించారు. మేడే సందర్భంగా శివ్వంపేటమండలంలోని దొంతి బస్టాండ్ వద్ద బీఆర్టీయూ (భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్) జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం జెండా ఆవిష్కరించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేశారు.
మెదక్ జిల్లా నెట్వర్క్, మే 1
నర్సాపూర్/మెదక్ మున్సిపాలిటీ, మే 1 : మేడే పురస్కరించుకొని నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో 31 మంది హమాలీలకు ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి సోమవారం యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ధాన్యం సేకరణలో హమాలీల సేవలు వెలకట్టలేనివన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు నగేశ్, ఆంజనేయులు గౌడ్, హబీబ్‌ఖాన్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ మార్కెట్ యార్డులోని హమాలీలకు మార్కె ట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్‌తో కలిసి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగపతి మాట్లాడుతూ కార్మిక, కర్షక సంక్షేమాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనే సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ కార్యదర్శితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.