‘సర్’ ప్రక్రియలో బీఎల్వోల పాత్ర కీలకం
సర్ ప్రక్రియలో బీఎల్వోల పాత్ర కీలకమని కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని బాలాజీ గార్డెన్స్‌లో నియోజకవర్గ ఇన్చార్జి కాటశ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎల్వోల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
- కార్మిక శాఖ మంత్రి వివేక్
రామచంద్రాపురం,జూలై 1 : సర్ ప్రక్రియలో బీఎల్వోల పాత్ర కీలకమని కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని బాలాజీ గార్డెన్స్‌లో నియోజకవర్గ ఇన్చార్జి కాటశ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎల్వోల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన వారి ఓట్లు డిలిట్ కాకుండా బీఎల్వోలు పరిశీలించాలన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా ఫారమ్ 6,7,8 గురించి బీఎల్వోలు తప్పకుండా అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఫ్లెక్సీ వార్.. : ఆర్సీపురం డివిజన్లోని బాలాజీ గార్డెన్స్‌లో బీఎల్వోల సమావేశానికి మంత్రి వివేక్ హాజరవుతున్న సందర్భంగా పటాన్‌చెరుకు చెందిన కాంగ్రెస్ నేత శాపురం నరసింహారెడ్డి ముఖద్వారంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని కాంగ్రెస్ నాయకులే చింపేశారు. దీనిని జీర్ణించుకోలేని శాపురం నరసింహారెడ్డి ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానంటూ అసహనం వ్యక్తం చేశారు.
బాలాజీ గార్డెన్స్ ముఖ ద్వారంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్ మంత్రికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. శాపురం నరసింహారెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాటశ్రీనివాస్గౌడ్ ఫ్లెక్సీకి అడ్డంగా ఉండడంతోనే చించివేయడం జరిగిందని, ఇది చాలా చిన్న విషయమంటూ కాట వర్గీయులు కొట్టిపారేశారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెన్నెల, నీలం మధు, గాలి అనిల్, కాట సుధ, శ్రీనివాస్‌రెడ్డి, శివానందం, పుష్పానగేశ్, చంద్రారెడ్డి, ఈశ్వర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

