పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి పనులు
తెలంగాణలో తొలి ఐఎస్వో గుర్తింపు పంచాయతీ
గజ్వేల్, మే 18 : పల్లె ప్రగతిలో భాగంగా నిర్వహించిన అభివృద్ధి పనులతో పల్లెలు పట్టణాలను తలపిస్తున్నాయని చెప్పడానికి గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని కుకునూర్‌పల్లి గ్రామం అన్ని గ్రామాలకు మోడల్‌గా నిలుస్తున్నది. కుకునూర్‌పల్లి గ్రామంలో 2011 లెక్కల ప్రకారం 4123మంది జనాభా ఉండగా ప్రస్తుతం 6వేలకు పైగా చేరింది. ఓటర్లు 3850మంది ఉన్నారు. గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యం, ఆరోగ్య వాతావరణాన్ని నెలకొల్పడమే లక్ష్యం గా సీఎం కేసీఆర్ 2019 సెప్టెంబరు 6న పల్లె ప్రగతిని 30 రోజుల ప్రత్యేక ప్రణాళికతో నిర్వహించారు. పల్లె ప్రగతిలో భాగంగా కుకు నూర్పల్లిలో సర్పంచ్ జయంతీనరేందర్ 121మందితో స్వచ్ఛసేన ఏర్పాటు చేశారు. ఈ స్వచ్ఛసేన గ్రామంలోని మురికి కాల్వల పరి శుభ్రత పర్యవేక్షణ, పంచాయతీ పరిధిలోని రహదారులు, వీధులను ఊడ్చి, చెత్తాచెదారాన్ని, పిచ్చిమొక్కలను తొలగించడం తదితర ప నులను నిర్వహిస్తున్నారు. ప్రజా చైతన్యంలో భాగంగా మానవహా రం, ఇంటింటికి తిరుగుతూ పారిశుధ్యం, పల్లెప్రగతి గురించి అవగా హన కల్పించారు. పల్లె బాగుండాలని పారిశుధ్య చర్యల్లో గ్రామస్తు లు సైతం పాలు పంచుకుంటూ పరిశుభ్రతా చర్యలను చేపట్టారు. ఇప్పటి వరకు పల్లె ప్రగతి స్ఫూర్తితో విధులు నిర్వర్తిస్తుండడంతో కుకునూర్‌పల్లి అద్దంలా మెరిసిపోవడమే కాదు.. హరితహారంతో ఆకుపచ్చని అందాలను అలుముకున్నది.
గ్రామంలో ఎకరం విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనం ప్రైవేటు పార్కు కు దీటుగా ఏర్పాటు చేశారు. పిల్లల ఆటవస్తువులు, అమ్యుజ్‌మెంట్ పార్కు ఆటవస్తువులతో ప్రకృతి వనాన్ని చిన్నారుల కోసం ఆక ర్షణీయంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. వృద్ధులు, యువ కులు వాకింగ్ చేయడానికి అనువుగా పల్లె ప్రకృతి వనం లో వాకింగ్ ట్రాక్‌లను నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. ప్రకృతి వనంలో ప్రజల ఆర్యోగానికి దృ ష్టిలో ఉంచుకుని వివిధ రకాల ఔషధ మొక్కలు, ఆహ్లాదం కలిగించడానికి పండ్ల మొక్కలు, అలంకరణ, పూల మొక్కలతో అందంగా పరి సరాలను తీర్చిదిద్దారు. పల్లె ప్రగతిలో భాగం గానే రైతువేదిక వద్ద మరో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రకృతి వనంలో కూ డా వాకింగ్‌ట్రాక్, ఔషధ, పూలు, పండ్లు, అలంకరణ మొక్కలను నాటారు. రైతు వేదికకు వచ్చే రైతులకు గ్రామీణ వాతావర ణాన్ని అనుభవంలోకి తీసుకురావడానికి పార్కులో రైతు, ఎద్దుల బండి, మహిళా రైతు, ఆవు,లేగ, తదితర బొమ్మలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సిద్దిపేట తరహా కుకునూర్‌పల్లి పల్లె ప్రకృతి వనం వద్ద ఐలవ్ కుకునూర్‌పల్లి సింబల్‌ను అందంగా ఏర్పాటు చేశారు. అలాగే గ్రామానికి లింక్ అయి ఉన్న ప్రతి రహదారిలో 25 చొప్పున మొక్కలు నాటగా, ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి రహదారులకు వన్నె తెస్తున్నాయి. రూ.10లక్షల వ్యయంతో 15గుంటల స్థలంలో డంపింగ్ షెడ్ ఏర్పాటు చేసి, చెత్తను సేకరించడంతో పాటు వేరు ఆదాయాన్ని పొందుతున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠ శాలలో సర్పంచ్ పోల్కంపల్లి జయంతీనరేందర్ సొంత నిధులతో ఆటవస్తులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 15గుంటల స్థలంలో 12వేల మొక్కలను పెంచేందుకు వీలుగా నర్సరీని నిర్వహిస్తున్నారు.
పకడ్బందీగా విధుల నిర్వహణ
గ్రామం మొత్తం 16సీసీ కెమెరాలు, గ్రా మానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి అన్ని వీధుల్లో మొత్తం 39 మైక్‌లను ఏర్పాటు చేశారు. పారిశుధ్య సేవలను అందించడంలో పంచాయతీ కార్మికులు విధులకు క్రమంగా హజరయ్యేలా బయోమెట్రిక్‌ను గ్రామపంచాయతీలో ఏర్పాటు చేశారు. పల్లెప్రకృతి నిధులతో ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాం కర్ కొనుగోలు చేయడంతో ప్రతీరోజు ప్రజల నుంచి చెత్తను సేకరించడంతో పాటు చెట్లకు నీళ్లు పోయడంలాంటివి నిర్వ హిస్తు న్నారు. పంచాయతీ కార్యదర్శితో పాటు 9మంది పారిశుధ్య కార్మికు లకు వాకీటాకీలను ఇచ్చి ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యల సమా చారాన్ని పంచుకుంటున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కుకునూర్‌పల్లి గ్రామాన్ని అత్యద్భుతంగా, ఎంతో సుందరంగా, ఆరోగ్యకరంగా సర్పంచ్ పోల్కంపల్లి జయంతి నరేందర్, అధికారులు తీర్చిదిద్దడంతో కుకునూర్‌పల్లి గ్రామం ఐఎస్ఓ ద్వారా గుర్తింపు కూడా పొందింది. పంచాయతీతో పాటు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, రైతువేదికలకు కూడా ఐఎస్వో సర్టిఫికేట్ లభించింది.
ప్రజల రుణం తీర్చుకునే అవకాశం లభించింది
– పొల్కంపల్లి జయంతీనరేందర్, కుకునూర్‌పల్లి సర్పంచ్
సర్పంచ్‌గా ప్రజలకు అన్ని మౌలిక వసతులను నిర్వహణ, రోజూవారి సేవలను క్రమం నిర్వహి స్తున్నాం. పల్లెప్రగతి ద్వారా గ్రామాన్ని ఇతర గ్రామాలకు ఆదర్శంగా తీర్చిదిద్దడానికి చక్కని అవకాశం లభించింది. గ్రామానికి అద్భుతమైన పల్లెప్రకృతి వనాలు, నర్సరీ, డంపింగ్షెడ్ తదితర వసతులను ఏర్పాటు చేయడంతో పాటు గ్రామంలో సంపూర్ణ పారిశుధ్యానికి అవసర మైన చర్యలను పటిష్టం చేయగలిగాం. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో గ్రామ ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండా లన్న సీఎం కేసీఆర్ ఆలోచన గొప్ప ది. అనుక్షణం ప్రజల మం చిని కాంక్షించే సీఎం ఎప్పటికీ ఇలాగే ఉండాలి.