సింగూరుపై ప్రభుత్వ నిర్లక్ష్యం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న పాలిటశాపంగా మారిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు రివిట్మెంట్ పనులను ఆయన గురువారం పరిశీలించారు.
- మూడు నెలలుగా ముందుకు సాగని పనులు
- రివిట్మెంట్ పనుల్లో నాణ్యతా లోపం
- నీళ్లను వృథా చేసి చోద్యం చూస్తున్న అధికారులు
- సాగునీరు వదలక ఉసురుపోసుకుంటున్న మంత్రి దామోదర
- అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ధ్వజం
పుల్కల్, జూలై 2: కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న పాలిటశాపంగా మారిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు రివిట్మెంట్ పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగూరు ప్రాజెక్టుకు ముప్పు ఉందని కేంద్ర జలమండలి క్వాలిటీ కంట్రోల్ నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు.
ఎండాకాలంలో నీరు వదిలి వానకాలంలో పనులు చేపట్టడంపై ఆయన మండిపడ్డారు. రెండేండ్లుగా రైతులకు క్రాప్ హాలిడే ఇచ్చి, కనీసం ఆ రైతులను ఆర్థికంగా ఆదుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సింగూరు రివిట్మెంట్ పనులు మూడు నెలలుగా సాగినప్పటికీ వెయ్యి మీటర్లు కూడా కాలేదని, ఇది మంత్రి దామోదర రాజనర్సింహ నిర్లక్ష్యమేనన్నారు. మంత్రికి అభివృద్ధి పనులపై చిత్తశుద్ధిలేదన్నారు. ఈ ఏడాది సాగునీరు ఇవ్వకుంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సింగూరు ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా లోపం లేకుండా చేసే చూడాల్సిన బాధ్యత మంత్రిపై ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పుల్కల్ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు రాజాగౌడ్, విష్ణయ్య, సుభాష్, మల్లేశం, రాజు, పుల్కల్ మాజీ సర్పంచ్ శ్రావణ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసాచారి, జిల్లా, మండల నాయకులు పోచయ్య, క్రిష్ణ, శ్రీశైలం, దుర్గయ్య, నారాయణరెడ్డి, రవి, శ్రీనివాస్, రాంచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

