మిరుదొడ్డి, ఆగస్టు 9: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా 15 రోజులుగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని కూడవెల్లి వాగు ప్రహిస్తున్నది. మిరుదొడ్డి మండలంలోని అల్వాల, అందె, మిరుదొడ్డి చెక్‌డ్యామ్‌లు నిండుకొని మల్లుపల్లి చెక్‌డ్యామ్‌లోకి నీరు దిగువకు వస్తున్నది.
మండల వ్యాప్తంగా భారీ వర్షం పడకున్నా ఎగువన కురిసి న వర్షాల కారణంగా చెక్‌డ్యామ్‌లు నీటితో నిండడంతో కూడవెల్లి వాగు పరీవాహక ప్రాంత రైతు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.