జహీరాబాద్, జూన్ 14: కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. హామీల అమలును సీఎం రేవంత్ గాలికి వదిలేశారని విమర్శించారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని అల్లీపూర్‌లోని ఫయాజ్ నగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పలువురు బీఆర్ఎస్లో చేరారు. జహీరాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు యాకూబ్ ఆధ్వర్యంలో షేక్ ఇస్మాయిల్ మిత్ర బృందం పార్టీలో చేరింది.
ఎమ్మెల్యే మాణిక్‌రావు వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనేక హామీలిచ్చి ఆధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నట్లు విమర్శించారు. మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించక పోవడంతో వారిపై హస్తం పార్టీకి ఉన్న ప్రేమ, చితశుద్ధి ఏంటో అర్థమైందన్నారు.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టు నారాయణ, పీఎసీఎస్ చైర్మన్ మచ్చేందర్, పార్టీ నాయకులు నామ రవికిరణ్, యాకూబ్, మహ్మద్ అలీ, శంకర్‌పాటిల్, అబ్రహం, హీరురాథోడ్, మోహన్‌రెడ్డి, జగదీశ్, సత్తార్ సాబ్, మల్లేశం, శ్రీకాంత్, స్వామిదాస్, చంద్రశేఖర్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.