చేర్యాల, మార్చి 24: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అగ్నిగుండాలతో ఆదివారం ముగిశా యి. అగ్నిగుండాలుఆదివారం అర్ధరాత్రి ప్రారంభమై సోమవారం వేకువజాము వర కు కొనసాగాయి. దత్తపీఠాధీశులు సిద్ధేశ్వర మహా స్వామీజీ వైదిక పర్యవేక్షణలో ఆలయ ఈవో రామాంజనేయులు, కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది, ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో వీరశైవ ఆగమ శాస్త్ర పద్ధతిలో నిర్వహించారు.
తొలుత స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు గర్భాలయం నుంచి కల్యాణ వేదిక ఆవరణకు తీసుకువచ్చి అగ్నిగుండం దాటించారు. అనంతరం భక్తులు అగ్నిగుండం దాటి ఆలయ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్నారు. అగ్నిగుండం ముగించిన అనంతరం సోమవారం ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పది ఆదివారాలపాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. లక్షలాదిగా భక్తులు దర్శించుకున్నారు.
బుకింగ్, హుండీ ఆదా యం రికార్డులు స్థాయిలో పెరిగింది. ఏఈ వో బుద్ది శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్లు శ్రీరాములు, సురేందర్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు సేవలందించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, సీఐ శ్రీను, ఎస్సై రాజు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.