సంగారెడ్డి, అక్టోబర్ 23: ఏటా చెరుకు రైతులకు మద్దతు ధర పెంచాలని కలెక్టర్ సమక్షంలో సమావేశాలు నిర్వహిస్తున్నా చక్కెర పరిశ్రమల నుంచి ఎలాంటి మద్దతు ధర పెంపునకు సంబంధించి ప్రకటన రావ డం లేదని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు కలెక్టర్ వల్లూరు క్రాంతికి వివరించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన మద్దతు ధర పెంపునకు సంబంధించిన సమావేశంలో బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడారు. ధర పెంపుపై గణపతి చక్కెర కర్మాగారం యాజమాన్యం, గాయత్రి యాజమాన్యం, గంగా కావేరి ప్రతి నిధులు సమావేశానికి హాజరైనా ధర పెంచేందుకు సుముఖత చూపలేదన్నారు.
చక్కెర పరిశ్రమల ప్రతినిధులు వారు తీసుకున్న నిర్ణయం ప్రకారమే ధర పెంచేందుకు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. టన్నుకు రూ.4500వేలు ప్రకటించి అమలు చేయాలని, రవాణా, చెరుకు కోతచార్జీల బాధ్యతను యాజమాన్యాలు తీసుకోవాలన్నారు. చెరుకు సాగు విస్తీర్ణం పెరగాలంటే చెరుకు ధర పెంచాలని విన్నవించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతుల కోరిక మేరకు యాజమాన్యాలు చెరుకు కోత, రవాణా చార్జీలు భరించాలని పరిశ్రమల ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు.
దీనికి చక్కెర పరిశ్రమల ప్రతినిధులు స్పందిస్తూ చెరుకు రైతు ల డిమాండ్లను ఆయా పరిశ్రమల యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్తామని, ధర విషయంలో వారం రోజుల గడువు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి,అదనపు కలెక్టర్ మా ధురి, కెన్ కమిషనర్ రాజశేఖర్, బీకేఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి రామకృష్ణారెడ్డి, కోశాధికారి సదానందరెడ్డి, సలహాదారు మురళీధర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, వీర న్న విజయేందర్‌రెడ్డి, మొగులయ్య, శ్రీనివా స్, రాములు, నందికంది, పోచారం, ఇరిగిపల్లి, గారకుర్తి, ఆత్మకూర్, చింతలపల్లి, మా రేపల్లి గ్రామాల చెరుకు రైతులు పాల్గొన్నారు.