బీరంగూడలో కిసాన్ ఫ్యాషన్ మాల్
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లో శుక్రవారం ప్రముఖ సినీతార మీనాక్షి చౌదరి సందడి చేసింది. ఆర్సీపురం బీరంగూడ కమాన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్‌ను కిసాన్ ఫ్యాషన్ మాల్ చైర్మన్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్త, డైరెక్టర్లు ధన్పాల్ ఉదయ్ కుమార్, ధన్పాల్ ప్రణయ్ కుమార్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.
- సినీతార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ప్రారంభం
రామచంద్రాపురం, జూలై 10: సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లో శుక్రవారం ప్రముఖ సినీతార మీనాక్షి చౌదరి సందడి చేసింది. ఆర్సీపురం బీరంగూడ కమాన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్‌ను కిసాన్ ఫ్యాషన్ మాల్ చైర్మన్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్త, డైరెక్టర్లు ధన్పాల్ ఉదయ్ కుమార్, ధన్పాల్ ప్రణయ్ కుమార్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.
ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి, షాపింగ్‌మాల్ తిరిగి సందడి చేశారు. నూతన వస్ర్తాలతో స్టిల్స్ ఇచ్చారు. మీనాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానులు వారి ఫోన్ల్లో ఆమె ఫొటోలను తీసికొని మురిసిపోయారు. కొందరు ఆమెతో సెల్ఫీలు దిగారు. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అంతకుముందు మీనాక్షి చౌదరి మీడియాతో మాట్లాడారు. కిసాన్ ఫ్యాషన్ షాపింగ్‌మాల్ వినియోగదారులను ఆకట్టుకుంటుందన్నారు.ఒకేచోట అన్నిరకాల ఆధునిక వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తెచ్చారని, వినియోగదారులు కిసాన్ ఫ్యాషన్ మాల్ని ఆదరించాలని కోరారు.
అనంతరం నిర్వాహకులు ధనుంజయ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఆర్సీపురంతో పాటు పరిసర ప్రాంత ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పండుగలకు, శుభాకార్యాలకు సరికొత్త కలెక్షన్స్‌ను హోల్‌సేల్ ధరలకే అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు పుష్పానగేశ్, సింధూఆదర్శ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గెమల్లేశం, బీఆర్ఎస్ నాయకుడు గూడెం మధుసూదన్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

