Sarpanch | మెదక్ రూరల్, డిసెంబర్ 14 : సర్పంచ్‌గా ఎన్నికై తమ తండాకు సేవ చేయాలని ఇద్దరు బరిలోకి దిగారు. అయితే కౌంటింగ్‌లో వారి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా పోటీ సాగింది. ఫైనల్‌గా ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయగా ఒకరిని సర్పంచ్ పదవి వరించింది.
వివరాల్లోకి వెళితే..మెదక్ మండలం చీపురు దుబ్బ తండా గ్రామ పంచాయతీకి 377 ఓట్లు ఉండగా ఇద్దరికి సమంగా 367 ఓట్లు పోలు అయ్యాయి…అందులో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన కేతవత్ సునీత , బీఆర్ ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన బిమిలికి ఇద్దరికి 182 సమానమైన ఓట్లు వచ్చాయి..
అందులో రెండు ఓట్లు చెల్లని ఓట్లు పడగా ఒక్క ఓటు నోటాకు పడ్డది. దీంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశాడు.. అందులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మహిళా అభ్యర్థి కేతవత్ సునీతకు విజయం వరించింది.