బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ఊరూవాడా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అన్నదానాలు చేపట్టారు. దవాఖానల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పేదలు, బాధితులకు ఆర్థిక సాయాలు చేశారు. దవాఖానల్లో రోగులకు పండ్లు,బ్రెడ్డు పంపిణీ చేశారు. ఆలయాల్లో పూజలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. బైక్‌ర్యాలీలు, కేకు కటింగ్‌లు చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. పెద్దఎత్తున గులాబీ అధినేత కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం, జలాభిషేకం చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్,ఫిబ్రవరి 17