చేర్యాల, జనవరి 10: పద్మశాలీల సంక్షేమం కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో శనివారం పట్టణ పద్మశాలి సంఘం రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆయన పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొక్కుల సురేందర్, ప్రధాన కార్యదర్శి పాము బాల్‌నర్సయ్య, ఉపాధ్యక్షుడు గోనే హరి, కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలు పద్మశాలీల బాగు కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి సంక్షేమానికి ప్రత్యేక పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. పద్మశాలీలు నేత పనిలో ఉపయోగించే పలు రసాయనాలు, వస్తువులకు సబ్సిడీ ఇచ్చారని, ప్రత్యేకంగా టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేశారన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు బతుకమ్మ చీరలు తయారు చేయించి వారికి ఆర్థికంగా చేయూత ఇచ్చినట్లు తెలిపారు. బీడీ టేకేదారులతో పాటు బీడీ కార్మికులకు సైతం పింఛన్ పథకం ప్రవేశపెట్టడడంతో ఆకుటుంబాలు బాగుపడ్డాయన్నారు. పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పద్మశాలీలకు తగు ప్రాధాన్యత కల్పిస్తానని, పద్మశాలి సమాజం బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా మార్కండేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.అనంతరం పద్మశాలి సంఘం కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు ఆడెపు వెంకటయ్య, తడ్కపల్లి చందు,గోనే లక్ష్మీనారాయణ, కూరపాటి మధుసూదన్, మలిపెద్ది మురళి, దాసరి బాలరాజు, బొగ్గు గౌరినాథ్, ఆడెపు యాదగిరి, పరమాత్మ, నర్సింహులు, సంతోష్,రమేశ్, సురేశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, ఎర్రోళ్ల రామచంద్రం, యూత్ ఇన్చార్జి అంజయ్య, ఐలయ్య, రాళ్లబండి పరిపూర్ణం, పచ్చిమడ్ల మానస పాల్గొన్నారు.