మెదక్ రూరల్/ రామాయంపేట/ నిజాంపేట/ చేగుంట/ చిన్నశంకరంపేట, జనవరి 24 : కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవావాలని జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ లావణ్యారెడ్డి అన్నారు. మెదక్ మండలం జానకంపల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్పర్సన్ మాట్లాడుతూ.. జిల్లాలో రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొ నసాగుతుందన్నరు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గం టల వరకు కంటి పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకుని, అంధత్వాన్ని దూరం చేసు కోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయిరాం, ఆత్మ కమిటీ చైర్మన్ ఆంజగౌడ్, ఎంపీపీ యమునాజయరాంరెడ్డి, ఎంపీడీవో శ్రీరాములు, బీఆర్ఎస్ నాయకులు సంగమేశ్వర్, జయరాంరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిన్నశంకరంపేటతోపాటు మండల పరిధిలోని సూరారం చెన్నాయపల్లి గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. శిబి రాలను మెడికల్ ఆఫీసర్ సాయిసింధు పర్యవేక్షించారు.
2వేల మందికి చికిత్స.. 650 మందికి అద్దాలు
డి.ధర్మారం పీహెచ్సీ పరిధిలోని రామాయంపేటతోపాటు మండలంలోని డి.ధర్మారం, కోనాపూర్, నిజాంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల్లో రెండు మండలాల్లో 2వేల మం దికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యురాలు హరిప్రియ తెలిపారు. ఇప్పటివరకు 650 మందికి కంటి అద్దాలు అంద జేశామన్నారు. 195 మందికి చికిత్స కోసం జిల్లా కేంద్ర దవాఖానకు రెఫర్ చేసినట్లు తెలిపారు. డి.ధర్మారం పీహెచ్సీ పరిధిలోని కంటివెలుగు శిబిరాలకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి, కంటి పరీక్షలు చేయించుకుంటున్నట్లు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో వైద్యులు లావణ్య, నర్సింహులు, పీహెచ్ఎన్ సత్తమ్మ, సూపర్వైజర్ సునంద, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
‘కంటి వెలుగు’కు అపూర్వ స్పందన
నిజాంపేట మండలంలో జడ్చెరువుతండా, నందిగామ గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాలకు గ్రామస్తులు భారీగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. నందిగామలోని కంటివెలుగు శిబిరాన్ని హెచ్‌ఈవో(ఆరోగ్య విస్తరణాధికారి) చారి, ఎంపీవో రాజేందర్, సర్పంచ్ ప్రీతి సందర్శించారు. నందిగామలో ఇప్పటివరకు 123 మందికి కంటి పరీక్షలు నిర్వహించారని, 32 మందికి కళ్లాద్దాలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. దృష్టిలోపం ఉన్నవారు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఆరీఫ్ హుస్సేన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి
చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీవో కృష్ణమోహన్, సర్పంచ్ గోపాల్‌రెడ్డి సందర్శించారు. వీరి వెంట డాక్టర్ సృజన, కార్యదర్శి తిరుపతి, వైద్య సిబ్బంది శశిధర్‌రెడ్డి, మజీనాబేగం, మాధురి, ఏఎన్ఎం పద్మ, ఆశ వర్కర్లు ఉన్నారు.
ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలి : ఎంపీపీ సబిత
ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న వైద్యసేవలను విని యోగించుకోవాలని నార్సింగి ఎంపీపీ సబిత సూచించారు. నార్సింగి మండలంలోని నర్సంపల్లి పెద్దతండాలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ చత్రీయనాయక్తో కలిసి ఎంపీపీ సబి త ప్రారంభించారు. భీంరావ్పల్లి గ్రామంలో కంటి పరీక్షలు పూర్తి చేశారు. చేగుంట మండలంలోని రాంపూర్, బోనాల్ గ్రామా ల్లో కంటి పరీక్షలు కొనసాగుతున్నాయి. వైద్యులు రవికుమార్, అనిల్‌కుమార్ కంటి పరీక్షలు చేస్తున్నారు.