పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి వరం
పేద్దింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి ఓవరమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్‌లో 57 మంది లబ్ధిదారులకు గురువారం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
- ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి
- మనోహరాబాద్‌లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
మనోహరాబాద్, అక్టోబర్ 20 : పేద్దింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి ఓవరమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్‌లో 57 మంది లబ్ధిదారులకు గురువారం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, నిరుపేదలకు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీజేపీ పాలిత ప్రాం తాల్లో ఎక్కడా కూడా తెలంగాణ పథకాలు లేవన్నారు. ఇంటింటికీ తాగునీరు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందన్నారు. రైతును రాజు చేయాలనే సంకల్పంతోనే వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారని, కేంద్రం వడ్లు కొనమని చెప్తే, రాష్ట్రమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ‘గడా’ముత్యంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ లతావెంకట్గౌడ్, సీఎం కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు, సర్పంచ్ చిట్కుల మహిపాల్‌రెడ్డి, ఆత్మకమిటీ డైరెక్టర్ భిక్షపతి, రేణుకా మహేందర్, నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, శ్రీరామ్, బాలేశ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

