రామాయంపేట, నవంబర్28: దేశంలోనే మహోన్న తమైన వ్యక్తి జ్యోతిబాపూలే అని రామాయంపేట ఉమ్మడి మెదక్ జిల్లా సావిత్రిబాయి ఫూలే సంఘం అధ్యక్షురాలు పోచమ్మల అశ్వీనిశ్రీనివాస్, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సబ్బని శ్రీనివాస్, దళిత బహుజన సంఘాల ప్రతినిధి పాతూరి రాజు అన్నారు. సోమవారం రామాయంపేటలోని మెదక్చౌరస్తా వద్ద జ్యోతి బాపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బహుజన నాయకుడు పాతూరి రాజు మాది గ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్యాల కిషన్, పోచమ్మల శ్రీనివాస్, మసాయిపేట మల్లేశం, కౌన్సిలర్ బొర్ర అనిల్, లద్ద నర్సింహులు, లక్ష్మణ్, నర్సాగౌడ్, సురేశ్ నాయక్ ఉన్నారు
నిజాంపేట, నవంబర్ 28: మండలంలోని కల్వకుంట లో సోమవారం మహిళల అభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే వర్ధంతిని గ్రామ బీసీ సంక్షేమ సంఘం ఆధ్యర్యంలో నిర్వహించారు. అనంతరం వారు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సం క్షేమ సంఘం సభ్యులు కృష్ణ, లక్ష్మీనర్సింహులు, నర్సింహు లు, పీఏసీఎస్ డైరెక్టర్ రేణుక, గ్రామస్తులు ఉన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 28 : పీఆర్టీయూ ఆధ్వర్యంలో జ్యోతిరావుపూలే వర్థంతి పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని పూలే విగ్రహానికి పీఆర్టీయూ జి ల్లా కార్యదర్శి కృష్ణ, బాధ్యులు రవికుమార్, మల్లారెడ్డి, సా యిలు, వెంకటేశం పూలమాల వేసి నివాళులర్పించారు.
తూప్రాన్, నవంబర్ 28 : బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావుఫూలే 132వ వర్థంతిని సోమవారం తూప్రాన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ సమాజంలోని కుల వివక్ష, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని ధారబోసిన వ్యక్తి ఫూలే అని కొనియాడారు. కార్యక్రమంలో యు వజన సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు భూషణంచారి, గౌటి బాలేష్, శ్రీహరి, అశోక్‌ముదిరాజ్ పాల్గొన్నారు.