సిద్దిపేట టౌన్, జూన్ 26: పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూ ర్తి సాయిరమాదేవి జడ్జిలకు సూచించారు. హైకోర్టు సూచనల మేరకు గురువారం జిల్లా కోర్టు సమావేశం మందిరంలో కేసులు త్వరగా పరిష్కరించాలని కోరు తూ జడ్జిలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాత కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. కార్యక్రమంలో జడ్జిలు జయప్రసాద్, మిలింద్ కాంబ్లి, సంతోష్‌కుమార్, తరణి పాల్గొన్నారు.