మెదక్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు న్యాయం జరిగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్‌లోని టీఎన్జీవో భవన్లో సంఘం జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం, డైరీ క్యాలెండర్ ఆవిషరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవో పాత్ర వెలకట్టలేదని గుర్తు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య కిందిస్థాయి ఉద్యోగస్తులు నలిగిపోతున్నారని, మన ఉద్యోగాలు మనకు దక్కాలనే ఉద్దేశంతో కేసీఆర్ జోనల్ వ్యవస్థ తీసుకువచ్చారని తెలిపారు.
మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపేలా తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు, ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ… ఉద్యోగులకు 43శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ ఏర్పాటులో టీఎన్జీవోల పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ.. టీఎన్జీవోల సంఘం ఉద్యోగుల హకుల పరిరక్షణ సంక్షేమమే కాకుండా ప్రజల ఆశయాలు, ఆకాంక్షల మేరకు పోరాడిన ఏకైక సంఘం టీఎన్జీవో అన్నారు. జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో మూడు ప్రధాన అంశాలపై తీర్మానాలు చేశారు.
కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, కలెక్టర్ రాహుల్‌రాజ్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి మినికే రాజ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అనురాధ, పూర్వపు మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నూతన మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్యామ్‌రావు, జిల్లా సహాధ్యక్షులు ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఫణిరాజ్, ఫజలుద్దీన్, ఎంకెటి అర్షద్, రఘునాథరావు, లీల, సంయుక్త కార్యదర్శులు, పోతురాజు శంకర్, శివాజీ, కిరణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రచార కార్యదర్శి నర్సింలు, క్రీడల కార్యదర్శి గోపాల్, కార్యవర్గ సభ్యులు మరియా, సతీష్, సలావుద్దీన్, మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్, అల్లాదుర్గం, ఏడుపాయల వనదుర్గ, చేగుంట యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొన్నారు.